కన్నీటితో నీకు వీడ్కోలు చెప్పక తప్పడంలేదు!
గ్రీష్మమత టా పరుచుకుపోయి విస్తరించిన
తృణసంపదంతా క్రమేపీ రూపు రేఖలనుకోల్పోతూ
హిమశకలాలతో ముఖమంతా కప్పుకుని
హృదయ విదారకమై వేదనను కలిగిస్తున్నది.
ప్రకృతిమాతా తన మంచు దుప్పటిని
ధరణీతలమంతటా కప్పిపడేయాలన్న
ఉత్సుకతతో ముదుకడుగులు వేస్తున్నది.
నేను నడువవలసిన దారంతా రాలిపడినాకులతో
అస్తవ్యస్తంగా తయారయికనుమరుగై పోతున్నది.
నన్నుఇద oతా అయోమయానికి గురిచేస్తున్నది.
ఇంకేం చేయాలో అస్సలేం బోధపడడంలేదు.
అంతరాతరాళాల్లో పరుచుకుపోతున్న నిశ్శబ్దం
ఏకాoతాన్ని తోడు రమ్మని పదే పదే
విజ్ఞాపనలనందిస్తున్నది.
ఎవరితో సంభాషించాలన్నా మాట పెగలడo లేదు.
ఎదురుగా కనుపిస్తున్నదంతా
నిర్మానుష్యమౌతున్న వనసమూహం.
ఏ ఒక్కపిట్టా తన గళాలను సవరిస్తున్న
సంద డేం స్ఫురించడంలేదు.
ఏఒక్కపువ్వూ తనపరిమళాను ప్రసరింపజేయాలని
కుతూహలపడుతున్నసందర్భమూ కనరావడంలేదు.
ఆకాశమంతా దట్టమైననల్లని మబ్బులతో
చిక్కని చీకటిని నేలకు పంపి నిమ్మకు నీరెత్తినట్లు
నిస్త్రాణతో నిలుచుండిపోయినట్లనిపిస్తుంది.
ఇంత నిరామయ ధోరణితో సర్వ ప్రాణికోటీ
శ్వాసించడం సాధ్యంకాదుగదా!
శాసిస్తున్నరుతువులను గట్టిగా నిలదీయాలన్న తపన.
ఎటువైపు దృష్టిసారించినా మౌనముద్రను దాల్చిన ప్రకృతి.
ఇలా స్థాణువై జడపదార్ధంలా స్థిరీకరించబడడం
ఎవరికయినా మనో వ్యధను కలిగించడం సహజమే గదా!
కాదనలేం!!
ఈ ప్రవాసo ఇంకెన్నాళ్ళని దీనంగా ప్రశ్నిస్తున్న మనసును
రుతువు మారేదాకా ఈ శైధిల్యం తప్పదని
సమాధానం చెప్పాలని
మనసు ఉవ్విళ్ళూరుతున్నది.
==================================
గ్రీష్మమత టా పరుచుకుపోయి విస్తరించిన
తృణసంపదంతా క్రమేపీ రూపు రేఖలనుకోల్పోతూ
హిమశకలాలతో ముఖమంతా కప్పుకుని
హృదయ విదారకమై వేదనను కలిగిస్తున్నది.
ప్రకృతిమాతా తన మంచు దుప్పటిని
ధరణీతలమంతటా కప్పిపడేయాలన్న
ఉత్సుకతతో ముదుకడుగులు వేస్తున్నది.
నేను నడువవలసిన దారంతా రాలిపడినాకులతో
అస్తవ్యస్తంగా తయారయికనుమరుగై పోతున్నది.
నన్నుఇద oతా అయోమయానికి గురిచేస్తున్నది.
ఇంకేం చేయాలో అస్సలేం బోధపడడంలేదు.
అంతరాతరాళాల్లో పరుచుకుపోతున్న నిశ్శబ్దం
ఏకాoతాన్ని తోడు రమ్మని పదే పదే
విజ్ఞాపనలనందిస్తున్నది.
ఎవరితో సంభాషించాలన్నా మాట పెగలడo లేదు.
ఎదురుగా కనుపిస్తున్నదంతా
నిర్మానుష్యమౌతున్న వనసమూహం.
ఏ ఒక్కపిట్టా తన గళాలను సవరిస్తున్న
సంద డేం స్ఫురించడంలేదు.
ఏఒక్కపువ్వూ తనపరిమళాను ప్రసరింపజేయాలని
కుతూహలపడుతున్నసందర్భమూ కనరావడంలేదు.
ఆకాశమంతా దట్టమైననల్లని మబ్బులతో
చిక్కని చీకటిని నేలకు పంపి నిమ్మకు నీరెత్తినట్లు
నిస్త్రాణతో నిలుచుండిపోయినట్లనిపిస్తుంది.
ఇంత నిరామయ ధోరణితో సర్వ ప్రాణికోటీ
శ్వాసించడం సాధ్యంకాదుగదా!
శాసిస్తున్నరుతువులను గట్టిగా నిలదీయాలన్న తపన.
ఎటువైపు దృష్టిసారించినా మౌనముద్రను దాల్చిన ప్రకృతి.
ఇలా స్థాణువై జడపదార్ధంలా స్థిరీకరించబడడం
ఎవరికయినా మనో వ్యధను కలిగించడం సహజమే గదా!
కాదనలేం!!
ఈ ప్రవాసo ఇంకెన్నాళ్ళని దీనంగా ప్రశ్నిస్తున్న మనసును
రుతువు మారేదాకా ఈ శైధిల్యం తప్పదని
సమాధానం చెప్పాలని
మనసు ఉవ్విళ్ళూరుతున్నది.
==================================
No comments:
Post a Comment