అపరిమితమైన వేగంతో
అతిధులంతా
పరుగు పరుగునా నిష్క్రమించాలి
వెనువెంటనే వారు వదిలివెళ్ళిన
పాదముద్రలనన్నింటినీ
ఆనవాలు కూడా కనబడని విధంగా
వడి వడిగా చెరిపేయాలి.
వారిని హృదయానికి హత్తుకుని
సర్వ సాధారణమైనమందహాసo
సామీప్యంలో తదనుగుణంగా
వారి కత్యంత సన్నిహితంగా
ప్రదర్శింపబడాలి.
ఇవ్వాళ ప్రేతాత్మల పండుగ
అవెప్పుడు మృత్యుముఖంలోకి
నేరుగా వెళ్తాయో కూడా అర్ధమవని
అసందిగ్ధమైన ఆక్రోశం.
నీ నవ్వు అర్ధం పర్ధంలేని భ్రమలో పడి
చిరంతనంగా , వికసించనీ!!
తరంగాలపై తళుక్కుమనే కాంతిరేఖల్లా
తాత్కాలికంగానైనా దాన్ని తారట్లాడనీ!
కాలం అంచులపైన ఆకులపై
ప్రకాశించే మంచుబిందువులా
నీజీవితం ఆనంద నృత్యమాడనీ!!
నీవు అశాశ్వతమైన
పదాల పోహళింపుతో
క్షణకాలంపాటు
తీగలను సవరించుకో!!
[టాగూరు తోటమాలిలోని 45 వకవితకు తెలుగుసేత.]
అతిధులంతా
పరుగు పరుగునా నిష్క్రమించాలి
వెనువెంటనే వారు వదిలివెళ్ళిన
పాదముద్రలనన్నింటినీ
ఆనవాలు కూడా కనబడని విధంగా
వడి వడిగా చెరిపేయాలి.
వారిని హృదయానికి హత్తుకుని
సర్వ సాధారణమైనమందహాసo
సామీప్యంలో తదనుగుణంగా
వారి కత్యంత సన్నిహితంగా
ప్రదర్శింపబడాలి.
ఇవ్వాళ ప్రేతాత్మల పండుగ
అవెప్పుడు మృత్యుముఖంలోకి
నేరుగా వెళ్తాయో కూడా అర్ధమవని
అసందిగ్ధమైన ఆక్రోశం.
నీ నవ్వు అర్ధం పర్ధంలేని భ్రమలో పడి
చిరంతనంగా , వికసించనీ!!
తరంగాలపై తళుక్కుమనే కాంతిరేఖల్లా
తాత్కాలికంగానైనా దాన్ని తారట్లాడనీ!
కాలం అంచులపైన ఆకులపై
ప్రకాశించే మంచుబిందువులా
నీజీవితం ఆనంద నృత్యమాడనీ!!
నీవు అశాశ్వతమైన
పదాల పోహళింపుతో
క్షణకాలంపాటు
తీగలను సవరించుకో!!
[టాగూరు తోటమాలిలోని 45 వకవితకు తెలుగుసేత.]
======================================================
No comments:
Post a Comment