అతను నాకుదగ్గరగాజరిగి
సణగడం మొదలెట్టాడు చిరాకుగా
ఒక్కసారి నీ కనులెత్తిచూడవా?
అని ప్రాధేయపదుతున్న గొంతుకతో.
రెండుచేతులెత్తి ప్రార్ధనాపూర్వకంగా
మందలిస్తూ చెప్పాను, "బాబూ నన్ను వదిలెయ్" అని.
అతను తనముఖాన్ని నాకు దగ్గరగా చొప్పిస్తూ
దీక్షగా నావైపు దృక్కులు సారించడం మొదలెట్టాడు.
"సిగ్గులేదానీకు," అని బిగ్గరగా అరిచాను కొంచం స్వరం పెంచి.
అతనిలో ఎలాంటి చలనమూ కలిగినట్లులేదు.
అతను అనూహ్యంగా తన పెదాలతో నాచుబుకాన్ని స్పృశించాడు.
నేను వణుకుపుట్టి గట్టిగా అరవడం మొదలెట్టాను.
కానీ అతను సిగ్గుపడినట్లు దాఖలా యేమీ కనబడలేదు.
అతను హడావిడిగా నాజడలో ఓ గులాబీని తురిమాడు.
"అది నిష్ప్రయోజనమైన పని" ఎందుకు అలా చేసావ్? అని గద్దించాను.
నాగళసీమనలంకరించిన పుష్పమాలను హటాత్తుగా పెరికేసి
చటుక్కున విసురుగా వెళ్ళిపోయాడు ,కోపారుణ నేత్రాలతో.
నాహృదయం వేదనాతప్తయైపోయింది ఒకేఒక్కక్షణంలో.
"అతనుమరలా తిరిగి రాడెందుకని?" అని మూగగా
నామనసు నన్నుదోషిగా బోనులో నిలబెట్టింది ఉత్త పుణ్యానికే
మూగరోదన నాఏకాంతానికి తోడుగా నిలిచింది నిశ్శబ్దాన్ని హత్తుకుంటూ
--------------------------------------------------------
[టాగూర్ తోటమాలి సంపుటిలోని 36 వ గీతానికి నా తెలుగుసేత.]

No comments:
Post a Comment